
ఇక ముకుల్ దేవ్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యల తో ఉన్నారని .. ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది .. ముక్కుల్ దేవ్ 1996 లో దస్తాక్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు .. టాలీవుడ్ లో రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమాలో నటించి మెప్పించారు .. అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన ఏక్ నిరంజన్ సినిమా లో కూడా విలన్ గా నటించారు .. అలాగే సిద్ధం , కేడి , అదుర్స్ , బెజవాడ , మనీ మనీ మోర్ మనీ , నిప్పు , భాయ్ సినిమాల్లో కూడా నటించారు ..
అలాగే బాలీవుడ్లో సన్నాఫ్ సర్దార్ .....రాజ్‌కుమార్”, “జై హో”, “యమ్లా పగ్లా దీవానా వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు .. హింది తో పాటు పంజాబీ , బెంగాలీ , తెలుగు , తమిళం , కన్నడ , మలయాళం సినిమాల్లో కూడా నటించారు .. ఇక ఈయన చివరి మూవీ “అంత్ ది ఎండ్” .. ఆయన తమ్ముడు నటుడు రాహుల్ దేవ్ కూడా బాలీవుడ్ లో నటుడుగా , విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు ..