టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బన్నీ వాసు ఒకరు. ఇప్పటివరకు ఈయన గీత ఆర్ట్స్ బ్యానర్ కి సంబంధించిన ఎన్నో సినిమాలకు పని చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే స్వతహాగా చాలా సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. కొంత కాలం క్రితం ఈయన తండెల్ అనే మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాలో నాగ చైతన్య హీరో గా నటించగా ... సాయి పల్లవిమూవీ లో హీరోయిన్గా నటించింది. చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

మూవీ తో బన్నీ వాసు కి నిర్మాతగా మరింత మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఎయిర్ లైన్ సంస్థ పై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తాజాగా బన్నీ వాసు సోషల్ మీడియా వేదికగా ... హలో ఎయిర్ ఇండియా నేను బన్నీ వాస్ (ఉదయ శ్రీనివాసు). నేను ఈ రోజు ఖాట్మండు నుండి ఢిల్లీ వరకు AI 0218 (PNR No: POLG9Y) విమానంలో ప్రయాణించవలసి ఉంది. కానీ అది మీ చివరి సమయంలో రద్దు చేయబడింది. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని నేను అర్థం చేసుకున్నప్పటికీ, నేను బిజినెస్ క్లాస్ ప్యాసింజర్ మరియు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతను. నేను ఖాట్మండు లోని మీ స్టాఫ్ మెంబర్ అనిష్‌ని సంప్రదించడానికి కూడా ప్రయత్నిస్తున్నాను ... మరియు ఒక కౌంటర్ నుండి మరొక కౌంటర్‌కి కూడా తిరుగుతున్నాను. కానీ నేను అతన్ని ఎక్కడా కనుగొనలేకపోయాను.నేను ఈ రోజు రాత్రి 9 గంటల విమానం గురించి కూడా ఆరా తీస్తున్నాను. కానీ మీ బృందం నుండి అందుకు సంబంధించిన ఖచ్చితమైన స్పందన కూడా లేదు. నేను నా పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో ప్రస్తుతం ప్రయాణిస్తున్నాను. తక్షణ సహాయాన్ని మీ నుండి ఆశిస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించడంలో సహాయపడండి అని సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: