స్టైలిష్ సార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.. ఎందుకంటే సినిమా మొదలుపెట్టేముందు గ్లింప్స్ సైతం రిలీజ్ చేయగా అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా హాలీవుడ్ స్టైల్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు అందులో కొన్ని సన్నివేశాలను చూపించారు. పుష్ప 2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ క్రేజ్ పెరగడంతో పాటు తన తదు పరిచిత్రాన్ని కూడా అంతకుమించి స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. పుష్ప చిత్రంలో జపాన్ తో పాటుగా ఇతర ప్రాంతాలలో కూడా అల్లు అర్జున్ భారీ పాపులారిటీ అందుకున్నారు.


అయితే ఇప్పటికే ఇందులో నలుగురు హీరోయిన్స్ పేరు వినిపించాయి.. ఒకరు జాన్వి కపూర్, దీపికా పదుకొనే, భాగ్యశ్రీ , మృణాల్ ఠాకూర్ వాటి హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. అయితే ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం ఇంతమంది హీరోయిన్స్ నటిస్తున్నారని అఫీషియల్ గా ఎక్కడ ప్రకటించలేదు. ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ సిస్టర్ పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్లు  వినిపిస్తున్నాయి. ఆ అమ్మడు ఎవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్.


తెలుగు ప్రేక్షకులకు కూడా నజ్రియా బాగా సుపరిచితమే ఎన్నో తెలుగు చిత్రాలలో నటించడమే కాకుండా మలయాళ చిత్రాలను కూడా తెలుగులో డబ్బింగ్ ద్వారా కూడా బాగానే పేరు సంపాదించింది. గతంలో డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన రాజా రాణి చిత్రంలో కూడా ఈమె హీరోయిన్గా నటించింది. అయితే ఇప్పుడు చెల్లెలు పాత్రలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ అట్లీ కూడా అల్లు అర్జున్ సినిమా కోసం అదిరిపోయే స్క్రిప్ట్ ని రెడీ చేశారని మాఫియా బ్యాగ్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: