టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ , బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా కెరీర్ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి వార్ 2 అనే హిందీ సినిమాలో నటించిన మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. మే 20 వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో భారీ ఎత్తున వ్యూస్ మరియు లైక్స్ రాలేదు.

దానితో ఈ సినిమా తెలుగు వెర్షన్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేశారు. కానీ ఈ మూవీ తెలుగు వర్షన్ టీజర్ ఓ అదిరిపోయే రికార్డును సొంతం చేసుకుంది. దీనితో ప్రస్తుతం తారక్ ఫాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నట్టు తెలుస్తుంది. వార్ 2 టీజర్ విడుదల అయ్యి ఇప్పటికే చాలా గంటలు అవుతుంది. ఈ మూవీ టీజర్ ఏకంగా యూట్యూబ్లో 125 గంటల పాటు ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది.

ఇలా ఈ మూవీ తెలుగు వర్షన్ టీజర్ కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు ... ఈ మూవీ తెలుగు వర్షన్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అని ఎంతో మంది విమర్శలు చేశారు. కానీ ఈ మూవీ తెలుగు వర్షన్ టీజర్ ఏకంగా 125 గంటల పాటు యూట్యూబ్లో ట్రైనింగ్ లో ఉంది అనే వార్త బయటకు రావడంతో ప్రస్తుతం తారక్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: