
ఈ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను మొత్తం బయటపెట్టేసాడు పవన్ కళ్యాణ్. చాలా చాలా నిజాయితీగా హుందాగా తన మూడు పెళ్లిల గురించి కూడా బయట పెట్టేశాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కి ఉన్న ఒక వ్యాధి గురించి కూడా బయటపడింది . అప్పటివరకు పవన్ కళ్యాణ్ కి అలాంటి ఒక వ్యాధి ఉంది అన్న సంగతి ఎవరికీ తెలియదు . పవన్ కళ్యాణ్ కి ఆరు , ఏడవ తరగతిలో ఉన్నప్పుడే ఆస్తమా , జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో బాగా ఇబ్బంది పడేవారట . ఆ సమయంలో బయటకు వెళ్లి ఆడుకోలేక నలుగురితో కలవలేక ఫ్రెండ్షిప్ అనేది ఎవరితో చేయలేక పుస్తకాలతోనే ఫ్రెండ్షిప్ చేశారట .
పుస్తకాలను ఫ్రెండ్స్ గా మార్చుకున్నారట . అంతేకాదు తన స్నేహితులందరూ ఎప్పుడు ఆటలలో ముందుకు వెళుతూ ఉంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి సారీ ఆటలు ఆడుతూ ఫెయిల్ అయిపోతూ ఉండేవారట. అసలు స్కూల్ కి వెళ్ళాలి అంటేనే ఇష్టం ఉండేది కాదట . ఏ విషయాన్ని కూడా ఎవరికీ చెప్పకుండా ఎవ్వరు చెప్పకుండానే సొంతంగా నేర్చుకోవడాని అలవాటు చేసుకున్నాడట . అదే మూమెంట్ లో 17 ఏళ్ళ వయసులో మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యారట . ఒకానొక సందర్భంలో సూసైడ్ కూడా చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారట. ఓ రోజు ఆ డిప్రెషన్ తట్టుకోలేక అన్నయ్య చిరంజీవి గన్ తీసుకొని కాల్చుకోవడానికి సిద్ధమయ్యాడట . అది చూసిన వదిన సురేఖ పవన్ కళ్యాణ్ చేతిలో నుంచి గన్ లాగి ఈ పిచ్చి పని ఏంటి అంటూ కోపడుతూ వెంటనే ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పి చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్తే నువ్వు చదవకపోయినా పర్వాలేదు బ్రతికుంటే చాలు అంటూ చెప్పారట . ఈ విషయాలన్నీ స్వయాన పవన్ కళ్యాణ్ నే బయట పెట్టడం సంచలనంగా మారింది.