టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన విష్ణుప్రియకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ విషయాలను వెల్లడించారు. షార్ట్ ఫిల్మ్స్ తో విష్ణుప్రియ కెరీర్ ను మొదలుపెట్టగా పోవే పోరా షో విష్ణుప్రియకు ప్లస్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.
 
ఈ షో తర్వాత విష్ణుప్రియకు అవకాశాలు వచ్చినా యాంకర్ గా ఆమె మరే షోకు పని చేయలేదనే సంగతి తెలిసిందే. మొదట బిగ్ బాస్ షోపై నెగిటివ్ కామెంట్ల ద్వారా వార్తల్లో నిలిచిన విష్ణుప్రియ తర్వాత రోజుల్లో మాత్రం బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా అందరికీ ఒకింత దిమ్మతిరిగే షాకిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విష్ణుప్రియ పలు టీవీ షోలతో బిజీగా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
విష్ణుప్రియ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు యాంకర్ అవ్వాలనే ఆలోచన లేదని కానీ అయ్యానని అయితే నాకు సంతృప్తి రాకపోవడంతో బ్రేక్ తీసుకుని వేరే ఏదైన చేయాలని అనుకున్నానని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు. యాంకరింగ్ చేయాల్సిన అవసరం లేకపోయినా డబ్బుల కోసం చేశానని ఆమె తెలిపారు. ఆ షోలో సుధీర్ ఉండటం వల్ల నా మైనస్ లు కనిపించలేదని ఆమె అన్నారు.
 
నాకు కొంచెం నత్తి ఉందని పెద్దగా మాట్లాడటానికి కష్టపడలేదని ఆమె కామెంట్లు చేశారు. నేను టీవీని వదిలి వెళ్లాలనుకున్నా అది నన్ను వదలట్లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఉగాది ఈవెంట్ లో సరిగ్గా చేయలేదని అనిపించి మళ్లీ చేయకూడదని అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే మళ్లీ మదర్స్ డే ఈవెంట్ కు యాంకరింగ్ కు అడిగారని ఆమె కామెంట్లు చేశారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: