తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన కొంత కాలం క్రితం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో హీరో గా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన హీరోగా నటించిన జాతి రత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఒక్క సారిగా ఈయన ఈమేజ్ తెలుగు సినీ పరిశ్రమలో భారీగా పెరిగిపోయింది. ఆఖరుగా నవీన్ పోలిశెట్టి "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే నవీన్ పోలిశెట్టి చాలా కాలం క్రితం అనగనగా ఒక రాజు అనే సినిమాను మొదలు పెట్టాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ చాలా లేట్ అవుతూ వచ్చింది..ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతుంది. మొదట ఈ మూవీ లో శ్రీ లీలను హీరోయిన్గా అనుకున్నారు. 

ఆ తర్వాత ఈ మూవీ లో శ్రీ లీల స్థానంలో మీనాక్షి చౌదరి ని హీరోయిన్గా తీసుకున్నారు. గత కొంత కాలంగా ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు అని ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల ఆయన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: