
ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నారా రోహిత్ తన పొలిటికల్ గురించి పలు విషయాలను తెలిపారు. ముఖ్యంగా తను చిన్న వయసు నుంచే రాజకీయాల కుటుంబం కాబట్టి ఆటోమేటిక్గా తనకి కూడా ఇంట్రెస్ట్ ఉందని.. అందుకే గత ఎన్నికలలో 12 ప్రాంతాలలో ప్రచారం చేశానని. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తానే ఎన్నికలలో డైరెక్ట్ గా పోటీ చేస్తానని తెలిపారు. 2024 తనకు కరెక్ట్ టైం కాదనిపించింది అందుకే పోటీ చేయలేదు.. 2029లో చేస్తాను అంటూ తెలిపారు.
అయితే పార్టీ కోసం ఎప్పుడైనా ఎక్కడైనా నిలబడతాను తనకు ఎలాంటి పోస్టులు కూడా అవసరం లేదని తెలిపారు. అలాగే ప్రతి నెల కూడా తమ ఊరిలో జరిగే సమస్యల గురించి అక్కడ ప్రజలను కూడా కలుస్తూ ఉంటాను వాళ్లకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తనతో చెబుతారని తన పరిధిలో ఉన్నవి తెలిసి కొంతమంది లోకల్ నాయకులకు చెప్పి మరి చేయిస్తానని తెలిపారు. ముఖ్యంగా తమ సొంత ఊరిలో ఎమ్మెల్యే కూడా తనకి బాగా సపోర్టు ఉందంటూ తెలిపారు. ఒకవేళ తాను అన్నిటికీ సిద్ధమయి ఎంట్రీ ఇస్తాను అనుకున్నప్పుడే మొదట తన పెదనాన్నకి చెబుతానని ఆ తర్వాత నారా లోకేష్ కి తెలియజేస్తానని తెలిపారు నారా రోహిత్. మరి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా నారా రోహిత్ పోటీ చేసే అవకాశం ఉన్నది.