
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతగా ఉంటూ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళుతున్న దిల్ రాజు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి నే. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మోస్ట్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. ఇండస్ట్రీలో ఆయన చెప్పిందే జరురుతుంది అని చాలా మంది నమ్ముతుంటారు. అలాగే నిజామాబాద్ కి చెందిన మరొక స్టార్ కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు . ఆయన మరెవరో కాదు హీరో నితిన్. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని తన స్టైల్ తో దున్నేసిన నితిన్ ఇప్పుడు హిట్ కోసం ట్రై చేస్తున్నాడు . అంతేకాదు యాంకర్ శ్రీముఖి కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిందే.
లౌడ్ స్పీకర్ అంటూ ట్యాగ్ చేయించుకొని జెట్ స్పీడ్ లో యాక్టివ్గా యాంకరింగ్ చేస్తూ టాప్ వన్ యాంకర్ గా తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది శ్రీముఖి . అంతే కాదు తనదైన కామెడీ టైమింగ్ తో రైమింగ్ అదరగొట్టేసే వెన్నెల కిషోర్ కూడా కామారెడ్డికి చెందిన వ్యక్తి నే. అంతేకాదు చమక్ చంద్ర "గాంధారి మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ". బుల్లితెరపై కమెడియన్ గా మంచి గుర్తింపు సాధించాడు . అంతేకాదు ఇంకా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్లు.. సీరియల్ ఆర్టిస్టులు కూడా నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన వారే.. ఇవన్నీ చూస్తుంటే సినిమా ఇండస్ట్రీకి నిజామాబాద్ జిల్లాకి ఏదో ఒకటి తీరని అనుబంధమే ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు..!