
ఇండియాలో సగానికి పైగా నార్త్ స్టేట్లోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. అయితే ఇలాంటి మూమెంట్లోనే రీసెంట్ గా ఫారిన్ కంట్రీ కి వెళ్లి వచ్చిన ఒక తెలుగు టాప్ స్టార్ హీరోకి కరోనా పాజిటివ్ వచ్చిందట. అంతేకాదు ఆయన టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్ రాగా ఆయన ఇంట్లోనే క్వారంతైన్ అయిపోయారట . ఈ విషయాన్ని మాత్రం బయట ఎక్కడ చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారట . కాగా ఆయనకి జలుబు - దగ్గు -గొంతు నొప్పి - జ్వరం రావడంతో డౌట్ వచ్చి టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ తేలిందట.
వెంటనే షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసి ఎక్కడికక్కడ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసి క్వారంటైన్ అయిపోయారట . అంతే కాదు తన ఫ్యామిలీ మొత్తం కూడా స్పెషల్ గా టెస్ట్లు చేసుకునే విధంగా మాట్లాడేసారట . అంతేకాదు ఈ విషయాన్ని బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా పడుతున్నాడట ఈ తెలుగు హీరో అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ కారణంగానే తెలుగు ఫిలిం సర్కిల్స్ లో ఇంత ఇష్యూ జరుగుతున్న కూడా ఆ హీరో ఎక్కడ ఏ విధంగా స్పందించడం లేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు .
మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇష్యూ ఇప్పుడు ఎంత హైలైట్ అవుతుందో అందరికీ తెలిసిందే, దిల్ రాజు స్పందించారు . అల్లు అరవింద్ స్పందించారు . అరాకొర మిగతా వాళ్ళు కూడా స్పందించి మా తప్పులేదు అంటూ చేతులు దులిపేసుకుంటున్నారు. అసలు మొదటి నుంచి ఈ ఇష్యూ లో అప్పర్ హ్యాండ్ గా ఉన్న ఈ హీరో మాత్రం అసలు బయటికి రావడం లేదు. సోషల్ మీడియా ద్వారా ఒక్క పోస్ట్ పెట్టడం లేదు . దీంతో అసలు విషయం ఏంటి అని ఆరా తీయగా ఉన్న నిజం బయటపడింది . అతగాడికి కరోనా పాజిటివ్ అని ఇంట్లోనే క్వారంటైన్అయిపోయాడు అని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని ఫిలిం సర్కిల్స్ లో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!