టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్న నటీమణులలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొదటగా నటించిన రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దానితో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో గొప్ప స్థాయికి చేరడం చాలా కష్టం అని చాలా మంది అభిప్రాయపడ్డారు.

కానీ ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం ఈమె తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోయిన్గా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సూపర్ క్రేజీ సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వరకు కొన్ని రోజులు క్రితమే అధికారికంగా ప్రకటించారు.

ఈమెకు మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో వరుసగా అవకాశాలు దక్కుతూ ఉండడం , అలాగే అందులో చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ వెళ్లడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే మీనాక్షి నటించిన సినిమాల్లో తన అందాలతో , నటనతో రెండింటితో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దానితో ఈమెకు సినిమా సినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరుగుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc