
ఆయన పేరు చెబుతుంటేనే తెలియని పూనకాలు వచ్చేస్తాయి . ఏవో తెలియని వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క తెలుగు అభిమాని ఆయన పేరు పలకగానే ఇలాంటి ఒక ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేడు ఎన్టీఆర్ జయంతి ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు . మరి ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ ఆయన గురించి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలను ట్రెండ్ చేస్తున్నారు . ఇలాంటి మూమెంట్లోనే ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది .
సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలలో కొన్ని కామన్ క్వాలిటీస్ ఉంటాయి . అందరూ డాన్స్ బాగా చేస్తారు . అందరూ బాగా నటిస్తారు . అందరూ డైలాగ్స్ కూడా బాగా చెబుతారు . కానీ సింగిల్ టేక్ లో డైలాగ్స్ ఫైనలైజ్ చేసే ఒకే ఒక్క హీరో మాత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనే చెప్పాలి. ఆశ్చర్యమేంటంటే ఇప్పటివరకు ఆయనలా సింగిల్ టేక్ లోనే గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పిన నటుడే లేడు. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ నటుడు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు లా డైలాగ్ చెప్పిన ఘనత అందుకోలేదు . జూనియర్ ఎన్టీఆర్ తాతల డైలాగ్స్ చెప్తాడు. కానీ సింగిల్ టేక్ లో అన్ని డైలాగ్స్ చెప్పే రేంజ్ కి ఇంకా ఎదగలేదు . కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాత్రం తన సినిమాల విషయంలో ఎప్పుడు డైలాగ్స్ ని సింగల్ టేక్ లోనే ఓకే చేసేస్తూ ఉంటారు. ఒక్కసారి పేపర్ చూసి చదివాడా అంతే ఇక టేక్ తీసుకునే ఛాన్సే ఉండదు డైరెక్ట్ గా ఆ డైలాగ్ ను చెప్పేసి షాట్ ఫైనలైజ్ చేసేస్తారు . ఇప్పటివరకు ఆ విషయంలో ఎన్టీఆర్ ని ఢీకొట్టే హీరోనే లేరు నిజంగా ఆ విషయంలో ఎన్టీఆర్ కి "సరిలేరునీకెవ్వరు" అని చెప్పాల్సిందే..!