తెలుగు సినిమా క్యాతిని దశ దిశలా వ్యాప్తి చెందించిన నట సర్వభూముడు నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా తెలుగు పరిచయ ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నందమూరి తారక రామారావు తన కెరియ ర్లో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని నటుడి గా ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు . అలాగే ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు . నటుడిగా అద్భుతమైన స్థాయికి ఎదిగే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న తర్వాత నందమూరి తారక రామారావు తెలుగుదేశం అనే ఓ రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాలకు కూడా ఎంట్రీ ఇచ్చాడు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఒక నటుడు రాజకీయాల్లో ఎదగడం అంత ఈజీ కాదు ఆయన రాజకీయాల్లో సక్సెస్ కాలేడు అని అనేక మంది అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. అయిన వాటి అన్నింటినీ పట్టించుకోకుండా నందమూరి తారక రామారావు రాజకీయాల్లో కూడా అద్భుతమైన స్థాయిలో ఎదిగి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. ఇకపోతే ఎంతో గొప్ప నటుడిగా రాజకీయ నాయకుడిగా గుర్తింపును సంపాదించుకున్న నందమూరి తారక రామారావు గారి 102 వ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం.

ఇకపోతే చాలా మంది నందమూరి తారక రామారావు కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటించాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ తారక రామారావు గారు కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా మరియు కొన్ని ఇతర భాషల సినిమాల్లో కూడా నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ లో తెలుగు తో పాటు తమిళ్ , హిందీ , గుజరాతి సినిమాల్లో నటించాడు. ఆ సినిమాల ద్వారా నందమూరి తారక రామారావు అద్భుతమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: