టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటిగా స్టార్ ఈమేజ్ ను సొంతం చేసుకున్న వారిలో సమంత ఒకరు. ఈమె ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఎన్నో సినిమాలలో నటించి , ఎంతో మంది స్టార్ హీరోలతో ఆడి పాడి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ ఈమేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికీ కూడా ఈమె అదే రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. కానీ ఈమెకు కెరియర్ బిగినింగ్ లో వచ్చిన స్థాయి విజయాలు ప్రస్తుతం మాత్రం దక్కడం లేదు. కానీ ఈమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. నటిగా ఈ మధ్య కాలంలో ఈమె ఫెయిల్యూర్ ను అందుకుంటున్న నిర్మాతగా మాత్రం ఈమె చాలా బాగా సక్సెస్ అయింది. సమంత తాజాగా శుభం అనే సినిమాను నిర్మించిన విషయం మనకు తెలిసిందే.

సమంత నిర్మించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చిన ఈ మూవీ ఆ తర్వాత బాగా పుంజుకొని మంచి కలెక్షన్లను వాదులు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 18 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 18 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 1.17 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్లో 1.38 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని ఈ మూవీ కి 1.20 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 3.75 కోట్ల షేర్ ... 7.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 2.8 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 3.75 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టడంతో ఈ మూవీ ఇప్పటికే 95 లక్షల రేంజ్ లో లాభాలను అందుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: