
అందుకే వాళ్లిద్దరి ముందు మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ గా ఉందని సుకుమార్ పేర్కొన్నారు. హనుమాన్ జంక్షన్ సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని సుకుమార్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో అర్జున్ ను దూరం నుంచి చూసేవాడినని ఆయన కామెంట్లు చేశారు. ఆయన అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నారని ఎవరైనా ఆయనకు ఆకర్షితులు అవుతారని కామెంట్లు చేశారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అర్జున్ వెనుకడుగు వేయలేదని జై హింద్ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. తన కూతురు కోసం సీతా పయనం సినిమా చేస్తున్నారని ఈ సినిమా ప్రయాణాన్నే ఒక సినిమగా తెరకెక్కించొచ్చని చెప్పుకొచ్చారు. ఏ, ఓం, ఉపేంద్ర లాంటి సినిమాలను తెరకెక్కించిన తర్వాత ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చని ఆయన కామెంట్లు చేశారు.
ఒకవేళ అలాంటి సినిమాలు నేను చేసి ఉంటే రిటైర్ అయిపోయేవాడినని ఆయన కామెంట్లు చేశారు. నా సినిమాల స్క్రీన్ ప్లేకు ఉపేంద్ర తెరకెక్కించిన ఈ మూడు సినిమలే స్పూర్తి అని సుకుమార్ కామెంట్లు చేశారు. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం ఆయనకు అలవాటు అని దాన్ని నేను చోరీ చేశానని సుకుమార్ పేర్కొన్నారు. సుకుమార్ చెప్పిన ఈ విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. దర్శకునిగా, నిర్మాతగా సుకుమార్ సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. నేటి తరం ఎంతోమంది దర్శకులకు ఆయన స్పూర్తిగా నిలుస్తున్నారు.