సాధారణంగా రామ్ చరణ్ నటించబోయే స్టోరీలన్నీ కూడా ఫైనలైజ్ చేసేది చరణ్ కాదు మెగాస్టార్ చిరంజీవి అంటూ ఎప్పటినుంచో ఓ న్యూస్ ట్రెండ్ అవుతూ వస్తూ ఉంటుంది . చిరంజీవి స్టోరీ చూస్ చేసిన కారణంగానే రామ్ చరణ్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు అని అంత మాట్లాడుకుంటూ వచ్చారు. నిజమే కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి ఆ మాత్రం సహాయం చేయడం తప్పులేదు కానీ ఓ సినిమా విషయంలో మాత్రం సురేఖ తీసుకున్న డెసిషన్ 100% కరెక్ట్ అయింది . దానికి సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రామ్ చరణ్ కి సురేఖ అంటే చాలా చాలా ఇష్టం.  సురేఖకి రామ్ చరణ్ అంటే చాలా చాలా ఇష్టం .

వీళ్ళ మధ్య బాండింగ్ వేరే లెవెల్ . కాగా ఎప్పుడు చరణ్ సినిమాల విషయంలో పెద్దగా పట్టించుకోని సురేఖసినిమా విషయంలో మాత్రం "వద్దురా నానా ఆ సినిమా చేయకు" అంటూ సజెస్ట్ చేసిందట.  ఆ సినిమా మరేంటో కాదు.. ప్రభాస్ నటించిన "ఆది పురుష్" సినిమా . నిజానికి డైరెక్టర్ ఓం రావత్ ఆదిపురుష్ సినిమాల్లో ముందుగా రామ్ చరణ్ ని అనుకున్నారట.  ప్రభాస్ ఈ సినిమాని ఫస్ట్ రిజెక్ట్ చేశారట.  ఆ తర్వాత ఓం రావత్ చాలా మంది హీరోలని అప్రోచ్ అయ్యి కథ వినిపించారట.  పైగా ఫర్ ద ఫస్ట్ టైమ్ దేవుడి గెటప్ లో కనిపించబోతున్నందుకు రామ్ చరణ్ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాడట.

కానీ ముందుగానే సురేఖకి ఈ పాత్ర అంతగా రామ్ చరణ్ కి సూట్ కాకపోవచ్చు అంటూ గెస్ చేసేసిందట . మరి ముఖ్యంగా ఓం రావత్ స్టోరీ చెప్పిన విధానం సురేఖకు అస్సలు నచ్చలేదట.  ఆయన చెప్పిన విధానంలోనే కన్ఫ్యూషన్ ఉందట . ఇక తెరకెక్కించేటప్పుడు ఎలా తెరకెక్కిస్తాడో.. పైగా దేవుడితో ఆటలా అటు ఇటు అయినా సరే అది రెండు విధాల నెగిటివ్గా మారిపోతుంది అంటూ వద్దు ఈ సినిమా చేయకు అంటూ రాంచరణ్ కి సురేఖ సజెస్ట్ చేసిందట . అనుకున్న విధంగానే ఈ సినిమా అంత హిట్ కాలేకపోయింది.  ప్రభాస్ ని ఓ రేంజ్ లో ట్రోలింగ్ గురి చేసింది ఈ సినిమా. అది అందరికీ తెలిసిందే . ఆ రోజు సురేఖ మాటలు విన్న రామ్ చరణ్ ఒక ఫ్లాప్ నుంచి తప్పించుకోగలిగాడు.  ప్రభాస్ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురయ్యాడు..!
 


మరింత సమాచారం తెలుసుకోండి: