మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె చాలా కాలం క్రితం హిందీ సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా అనేక హిందీ సినిమాల్లో నటించింది. ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో సరైన విజయం దక్కలేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం ఎక్కువ శాతం తెలుగు సినీ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన రూపొందిన దేవరా పార్ట్ 1 అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈమెకు దేవర పార్ట్ 1 మూవీ ద్వారా మొట్ట మొదటి బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది. ఇక ప్రస్తుతం ఈమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న పెద్ది అనే మరో తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే తాజాగా జాన్వీ కపూర్ ఓ క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో టైగర్ ష్రాఫ్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇకపోతే ఈయన తదుపరి మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టైగర్ ష్రాఫ్ హీరోయిన్ హీరోగా నటించబోయే సినిమాలో హీరోయిన్గా నటించడానికి జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ తెలుగు , మరో వైపు హిందీ సినిమాలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jk