చాలామంది హీరోలు 40,50 ఏళ్ళు దాటినా కూడా పెళ్లిళ్లు చేసుకోవడం లేదు..ఇక కొంతమంది హీరోలేమో 30 ఏళ్లకు 35 ఏళ్లకే ఓ ఇంటి వాళ్ళవుతున్నారు. అయితే ఈ హీరోకి దాదాపు 40 ఏళ్ల ఏజ్ ఉంటుంది. ఇన్ని రోజులు పెళ్లికి సంబంధించిన ఊసే ఎత్తలేదు. అలాంటిది సడన్ గా హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఇప్పటికే ఆ హీరో  ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఆయనే నారా రోహిత్.. పలు సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ హీరోగా ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్ తాజాగా బైరవం మూవీతో మన ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.చాలా రోజుల నుండి హిట్ కోసం ఎదురుచూస్తున్న నారా రోహిత్ ఈ భైరవం మూవీతోనైనా హిట్ కొట్టాలి అని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నారా రోహిత్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాయి.

ఎందుకంటే నారా రోహిత్ గత ఏడాది తన ప్రియురాలు అయినటువంటి హీరోయిన్ సిరి లేళ్ళతో నిశ్చితార్ధం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక సిరి లేళ్ళ నారా రోహిత్ ల పరిచయం ప్రతినిధి -2 మూవీ సమయంలో జరిగింది.ఈ మూవీలో వీరిద్దరూ హీరో హీరోయిన్ గా నటించారు. అలా ఈ సినిమా షూట్ చేస్తున్న సమయంలోనే ఇద్దరి మనసులు అభిప్రాయాలు కలవడంతో ఫైనల్ గా ప్రేమలో పడ్డారు.అలా వీరి ప్రేమని పెళ్ళి వరకు తీసుకెళ్తున్నారు.ఇక గత ఏడాది ఎంగేజ్మెంట్ అయినప్పటికీ నారా రోహిత్ తండ్రి మరణించడంతో పెళ్లి వాయిదా పడింది. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. నారా రోహిత్ సిరి లేళ్ళల వివాహం ఈ ఏడాది అక్టోబర్లో జరగబోతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయాన్ని స్వయంగానే నారా రోహిత్ భైరవం మూవీ ప్రమోషన్స్ లో బయటపెట్టారు.నా పెళ్లి ఈ ఏడాది అక్టోబర్ లో జరగబోతుంది. అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం తండ్రి చనిపోయిన తర్వాత సంవత్సరం వరకు ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. అందుకే తన పెళ్లిని వాయిదా వేసుకున్నారట. అయితే ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం అప్పటికి అన్నీ పూర్తవుతాయి కాబట్టి పెళ్లి అప్పుడు ఫిక్స్ చేసుకున్నాం అంటూ నారా రోహిత్ స్వయంగా చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఓజి మూవీలో తనకు కాబోయే భార్య సిరీ లేళ్ళ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు రూమర్ వినిపించింది. ఈ రూమర్ పై కూడా నారా రోహిత్ క్లారిటీ ఇచ్చారు.అలా ఫైనల్ గా ఈ టాలీవుడ్ హీరో మనసిచ్చిన హీరోయిన్ తో అక్టోబర్ లో పెళ్లి పీటలెక్కబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: