పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏ ఎం రత్నం ఈ సినిమాను నిర్మించాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్టార్ట్ అయింది. కానీ ఈ సినిమా షూటింగ్ చాలా డిలే అవుతూ ఉండడంతో క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగాన్ని తెరకెక్కించాడు. మొత్తం ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో మొదటి భాగాన్ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన అన్ని పనులను మేకర్స్ చాలా స్పీడ్ గా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదల అవుతుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో మామూలు టికెట్ ధరల కంటే కాస్త ఎక్కువ టికెట్ ధరలు ఉంటాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హరిహర వీరమల్లు టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి అని ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్టీప్లెక్స్ లలో 777 రూపాయలు గాను , సింగిల్ స్క్రీన్స్ లలో 700 రూపాయలు గాను మాక్సిమమ్ టికెట్ ధరలు ఉండే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలుబడలేదు. మరి హరిహర వీరమల్లు మూవీ టికెట్ ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంటాయో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: