ఏంటి కీర్తి సురేష్ ఆ హీరోతో లిప్ లాక్ కోసం ఓ సీనియర్ హీరోని పక్కన పెట్టిందా.. కీర్తి సురేష్ నిజంగానే అలాంటి నిర్ణయం తీసుకుందా.. ఎందుకు ఆ సీనియర్ హీరోతో సినిమాని రిజెక్ట్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో బిజీ అవ్వడానికి తెగ ట్రై చేస్తోంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ లిస్టులో ఒకరిగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం వెతుకులాడుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ హీరోయిన్ కి తెలుగులో అంతగా ఆఫర్లు రావడం లేదు. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న రౌడీ జనార్ధన్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చే కంటే ముందే కీర్తి సురేష్ కి తమిళ హీరో సూర్య మూవీలో కూడా అవకాశం వచ్చిందట. అయితే రౌడీ జనార్ధన్ సినిమా కోసం సూర్య సినిమాని రిజెక్ట్ చేసిందట కీర్తి సురేష్.ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ఇదేంటి సీనియర్ హీరో సూర్యని వదిలేసి కీర్తి సురేష్ యంగ్ హీరో సినిమాను కావాలనుకుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 అయితే కీర్తి సురేష్ తెలుగులో బిజీ అవ్వడం కోసమే మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారని రౌడీ జనార్ధన్ మూవీలో విజయ్ దేవరకొండతో నటించాలని భావిస్తుందట. అలాగే తమిళంలో ఇప్పటికే సూర్యతో కలిసి గ్యాంగ్ సినిమాలో చేసింది  కీర్తి సురేష్.ఆ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో మళ్లీ అదే కాంబోలో సినిమా వస్తే హిట్ అవుతుందో లేదో అన్న భయంతో కీర్తి సురేష్ ఆ సినిమాని రిజెక్ట్ చేసిందట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు రౌడీ జనార్ధన్ మూవీలో విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ ల కోసం సీనియర్ హీరో సూర్యను రిజెక్ట్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: