రానా నాయుడు అనే బోల్డ్ వెబ్ సిరీస్ ద్వారా వెంకటేష్ పరువు పోయిన సంగతి మనకు తెలిసిందే.అయితే వెంకటేష్ ని ఈ వెబ్ సిరీస్ లో చూసి చాలామంది విమర్శించారు. ఇన్ని రోజులుగా సంపాదించుకున్న గౌరవం అంతా ఒక్క వెబ్ సిరీస్ తో పోగొట్టుకున్నాడని ఎంతోమంది మాట్లాడుకున్నారు.అంతే కాదు సోషల్ మీడియా వేదికగా వెంకటేష్ పై విమర్శలు వెల్లువెత్తాయి.అయితే ఎంతమంది ఈ సిరీస్ చూసి విమర్శలు చేసినప్పటికీ ఈ వెబ్ సిరీస్ మాత్రం చాలా పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా వెంకటేష్ రానా దగ్గుబాటిల కాంబో చాలా బాగా సెట్ అయిందని, సినిమాలో విపరీతమైన బూతులు ఉన్నా కూడా ఆడియన్స్ మాత్రం ఈ వెబ్ సిరీస్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో ఈ వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా రానా నాయుడు -2 సిరీస్ ని కూడా తీసుకురాబోతున్నారు. 

ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో నటి సుర్విన్ చావ్లా కూడా ఒకరు. హిందీ,పంజాబీ,తమిళ వంటి సినిమాల్లో నటించిన సుర్విన్ చావ్లా రానా నాయుడు వెబ్ సిరీస్ లో కీలకపాత్ర లో నటించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ఓ టాలీవుడ్ డైరెక్టర్ పై చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి.. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలోని ఓ డైరెక్టర్ అవకాశం ఇస్తానని పిలిచి అవకాశం కావాలంటే నాతో ఒక రాత్రి గడపాలని అన్నారు. అయితే ఆయనకు హిందీ రాకపోవడంతో ఆయన దగ్గర వర్క్ చేసే ఓ మహిళతో హిందీలో ఈ విషయాన్ని అడిగించారు. కానీ ఆవిడ కూడా ఒక మహిళనే.. అలాంటిది నన్ను అలా అడగడానికి ఆమెకే  ఏ మాత్రం సిగ్గనిపించలేదా..ఆడదై ఉండి మరో ఆడదాన్ని కమిట్మెంట్ కోసం అడగడం ఏంటో అంటూ మాట్లాడింది.

అయితే తాజాగా మరో ఇంటర్వ్యూలో ఇంకో డైరెక్టర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది సుర్విన్ చావ్లా. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఓ డైరెక్టర్ సినిమా స్టోరీ చెబుతానని తన క్యాబిన్ కి మీటింగ్ కోసం రమ్మన్నారు. ఇక నేను ఆ డైరెక్టర్ ని మీట్ అయ్యి స్టోరీ తెలుసుకుందామని అక్కడికి వెళ్లాను. అయితే ఆ డైరెక్టర్ స్టోరీ మొత్తం చెప్పారు. అంతా బాగానే ఉంది  ఆ తర్వాత తిరిగి నేను వెళ్తున్న సమయంలో డోర్ దగ్గరికి  సెండ్ ఆఫ్ ఇస్తానని వచ్చారు. కానీ ఆ తర్వాత డోర్ దగ్గర నిల్చొని నన్ను బలవంతంగా లాగి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇక ఆయన చేసిన పనికి వెంటనే నేను గట్టిగా అరిచి అక్కడి నుండి ఇంటికి వచ్చేసాను.ఆ తర్వాత మళ్లీ ఆ డైరెక్టర్ చెప్పిన సినిమాలో నేను నటించలేదు.. అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై సంచలనం వ్యాఖ్యలు చేసింది రానా నాయుడు వెబ్ సిరీస్ నటి సర్వీన్ చావ్లా.

మరింత సమాచారం తెలుసుకోండి: