
అయితే విజయనిర్మల పెళ్లికి ముందు పెళ్లి తర్వాత పెట్టిన కండిషన్స్ గురించి తాజాగా కృష్ణ బర్తడే సందర్భంగా ఈ రోజున కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. విజయనిర్మల అటు సినిమాలలోనే కాకుండా తన భర్త దగ్గర కూడా చాలా మొండిగా ఉండేవారు .తనని ఒక్క మాట అన్న కూడా అసలు ఒప్పుకునేవారు కాదని ఒకానొక సందర్భంలో అలనాటి హీరోయిన్స్ వాణిశ్రీ ,విజయనిర్మల ఇలా అన్నదట..
గతంలో విజయనిర్మల నటించిన దేవదాసు సినిమా ప్రదర్శిస్తే ఆ థియేటర్లో దోమలు తప్ప ఏవి ఉండవని.. అదే ఏఎన్ఆర్ నటించిన దేవదాసు సినిమా ప్రదర్శిస్తే 100 రోజులు ఆడుతాయి అంటూ కౌంటర్ వేసిందట వాణిశ్రీ.. దీంతో హర్ట్ అయిన విజయనిర్మల ఇక ఆమెతో చచ్చేవరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదట. అంతేకాకుండా తన భర్త కృష్ణ అని కూడా ఆమెతో అసలు మాట్లాడనివ్వలేదని నటి రమప్రభతో వాణిశ్రీ తెలియజేసిందని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.అంతేకాకుండా వాణిశ్రీ, కృష్ణ మధ్య ఒక సినిమా ఒప్పందం కుదుర్చుకొని షూటింగ్ కి వెళ్ళినా కూడా అక్కడ గొడవ పడి మరి కృష్ణ సినిమా క్యాన్సిల్ చేయించిందట విజయనిర్మల. ఆ తర్వాత ఆ సినిమాలో హీరో సుమన్ ని తీసుకున్నారట. దీంతో ఇకమీదట వాణిశ్రీతో అసలు సినిమాలు నటించకూడదని చెప్పిందట విజయనిర్మల. ఆ మాటకి కట్టుబడే ఉన్నారట కృష్ణ.