
ఇక ఇప్పుడు రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది .. హైదరాబాదులో కొన్ని రోజుల పాటు షూటింగ్ చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత ముంబైకి వెళుతుంది అక్కడ నాలుగు రోజులు షూటింగ్ చేసుకుంటుంది .. అయితే ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాలో ఉన్న ప్రధన నటులు కూడా పాల్గొంటారని అంటున్నారు .. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే .. అయితే ఇదే తేదీకి నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 కూడా విడుదలకు రాబోతుందని తెలుస్తుంది .. బోయపాటి , బాలయ్య సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను ప్రకటించారు . ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే ఎంతో శరవేగంగా జరుగుతుంది ..
అయితే ఇదే క్రమంలో ఈ రీసెంట్ టైమ్స్ లో ఏ సినిమాకు కూడా గ్రాఫిక్స్ వర్క్ అనుకున్న సమయంలో పూర్తి కావడం లేదు కాబట్టి ఈ సినిమా చెప్పిన డేట్ కి వచ్చే అవకాశం లేదని , బాలయ్య కి ఎంతగానో కలిసి వచ్చిన సంక్రాంతికి ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని సినీ విశేషకులు అంటున్నారు .. కానీ మేకర్స్ ఇప్పటికే సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ చేయాలని ఆలోచనలో గట్టిగా ఉన్నట్టు తెలుస్తుంది .. అలాగే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ తో పాటు రిలీజ్ తేదీని కూడా విడుదల చేస్తారట .. ఇదే కనుక జరిగితే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మరియు నందమూరి అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరగబోతుంది .