మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ మాకు ప్రస్తుతం మల్టీప్లెక్స్ థియేటర్స్ కి ఏ సినిమా అందులో ఆడిన కూడా పర్సంటేజ్ ఇస్తున్నారు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో కొన్ని సినిమాలకు పర్సంటేజ్ ఇస్తున్న కొన్ని సినిమాలకు రెంట్ సిస్టం మాత్రమే ఇస్తున్నారు. మాకు కూడా అన్ని సినిమాలకు రెంట్ సిస్టం కాకుండా పర్సెంటేజ్ సిస్టం ఇవ్వాలి అనే ప్రతిపాదనను తీసుకువచ్చారు. ఇది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ ఓనర్స్ అంతా కూడా ఈ ప్రతిపాదనపై చాలా శాతం నిలబడ్డారు. కొంత కాలం క్రితం రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ ఓనర్స్ మాకు కచ్చితంగా ప్రతి సినిమాకు పర్సంటేజ్ ఇవ్వాలి అని ఇవ్వనట్లయితే మేము థియేటర్స్ కొంత కాలం బంద్ చేస్తాము అనే ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు వార్తలు వచ్చాయి.

దానితో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను ఎఫెక్ట్ చేయడానికి ఇంత కాలం లేని ఈ ప్రతిపాదనను ఇప్పుడు ముందుకు తీసుకువచ్చారు అని ఓ వార్త వైరల్ అయింది. దానితో పవన్ కూడా నేను సినిమా ఇండస్ట్రీ కి ఎంతో చేశాను. కానీ నా సినిమా విడుదల సమయంలో ఇలా చేయడం సరికాదు అని ఆయన అన్నారు. దానితో చాలా మంది ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి మేము పవన్ కళ్యాణ్ సినిమాను ఆపడానికి ఏమీ చేయలేదు అంటూ వివరణ ఇచ్చారు.

ఇకపోతే తాజాగా విశాఖపట్నం లో మే 30 వ తేదీన ఫిలిం ఛాంబర్ లో కొంత మంది సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తులు సమావేశం అయ్యారు. ఇక ఈ సమావేశంలో అనేక మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఆ సమావేశంలో పాల్గొన్నవారు మేము హరిహర వీరమల్లు సినిమా కోసం , దానిని ఆపడం కోసం ఏ ప్రయత్నాలు చేయడం లేదు. మేము మా సమస్యలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మా ముఖ్యమైన సమస్య మాకు రెంట్ వద్దు , షేరింగ్ కావాలి అనే సమస్యపై మేము పోరాడుతున్నాం. అది నెరవేరితే చాలు అనే ప్రతిపాదనను వారు తీసుకువచ్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: