తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నివేతా థామస్ ఒకరు. ఇప్పటివరకు ఈ బ్యూటీ ఎన్నో తెలుగు సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కొంత కాలం గ్యాప్ తర్వాత 35 చిన్న కథ కాదు అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఈ మూవీలోని నివేతా థామస్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఆ అవార్డులలో భాగంగా 35 చిన్న కథ కాదు మూవీలోని నివేతా థామస్ నటనకు అవార్డు కూడా వచ్చింది. ఇలా తాజాగా అవార్డు దక్కించుకున్న ఈ బ్యూటీ కి ఓ భారీ సినిమాలో ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... పూరి జగన్నాథ్ , విజయ్ సేతుపతి హీరోగా ఓ మూవీ ని మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో టబు ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇకపోతే ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో రాధిక ఆప్టే కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ఈ సినిమాలో రాధిక ఆప్టే స్థానంలో నివేతా థామస్ ను ఫైనల్ చేసినట్లు , ఈ బ్యూటీ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కి బెగ్గర్ అనే టైటిల్ను మేకర్స్ అనుకుంటున్నట్లు కొన్ని రోజులు అనేక వార్తలు వచ్చాయి. కానీ విజయ్ సేతుపతి ఇంకా ఈ సినిమాకు ఏ టైటిల్ను ఫిక్స్ చేయలేదు అని క్లారిటీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nt