
హరిహర వీరమల్లు సినిమా తూర్పు గోదావరి జిల్లా హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొందని తెలుస్తోంది. ఈ సినిమా ఈస్ట్ రైట్స్ 13 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం చెబుతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జిల్లాల్లో పవన్ సినిమాల హక్కులకు సైతం మంచి డిమాండ్ నెలకొందనే సంగతి తెలిసిందే.
హరిహర వీరమల్లు సినిమా బిజినెస్ విషయంలో మాత్రం చరిత్ర సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో సైతం పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. హరిహర వీరమల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా రిలీజ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యి కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తెలంగాణలో సైతం హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్ల పెంపు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మార్కెట్ గురించి సైతం ఈ సినిమాతో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగాల్లో సైతం మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.