టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు సినిమా విడుదల అవుతుంది అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ల వద్ద అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఆయన సినిమాకు హిట్ , ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇక ఆయన నటించిన సినిమాకు గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మహేష్ నటించిన సినిమాలు వరుస పెట్టి రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. రీ రిలీజ్ లో కూడా మహేష్ సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర తన సత్తా చాటుతున్నాయి. ఇప్పటివరకు మహేష్ నటించిన సినిమాలు చాలానే రీ రిలీజ్ అయ్యాయి. అందులో చాలా మూవీలు అనేక కొత్త కొత్త రికార్డులను సృష్టించాయి. ఇండియా వ్యాప్తంగా రీ రిలీజ్ ఆయన సినిమాలలో రీ రిలీజ్ లో భాగంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీలలో మహేష్ నటించిన సినిమాలే 4 ఉండడం విశేషం. మరి రీ రిలీజ్ లో భాగంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో టాప్ 10 లో నిలిచిన మహేష్ 4 సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.

మురారి సినిమా రీ రిలీజ్ లో భాగంగా 8.90 కోట్ల కలెక్షన్లను చేయగా తాజాగా రీ రిలీజ్ అయిన ఖలేజా సినిమా కేవలం ఒక్క రోజు లోనే 6.85 కోట్ల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీ రిలీజ్ లో 6.60 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా , బిజినెస్ మాన్ సినిమా 5.85 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా మహేష్ నటించిన ఈ నాలుగు సినిమాలు కూడా రీ రిలీజ్ లో భాగంగా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: