టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం అతడు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి త్రిష హీరోయిన్గా నటించగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మణిశర్మమూవీ కి సంగీతం అందించగా ... సోనుసోద్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. కోట శ్రీనివాసరావు , బ్రహ్మానందం , నాజర్ , శివాజీ షిండే , సునీల్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సమయంలో పరవాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకుంది. కానీ ఆ తర్వాత ఈ మూవీ బుల్లి తెరపై మాత్రం మంచి ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ కి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను ఆగస్టు 9 వ తేదీన 4k వర్షన్ తో రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మహేష్ నటించిన చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. 

అందులో భాగంగా చాలా సినిమాలు రీ రిలీజ్ లో బాగంగా అద్భుతమైన కలెక్షన్లను కూడా వసూలు చేశాయి. దానితో అతడు సినిమా కూడా రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది అని మహేష్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి ఇంపాక్ట్ ను బాక్సా ఫీస్ దగ్గర చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mb