
ప్రజెంట్ తెలుగు చిత్ర పరిశ్రమను పైరసీ , లీక్ లు తెగ ఇబ్బంది పెడుతున్నారు .. ఇప్పటికే స్టార్ హీరోలకు సంబంధించిన షూటింగ్ సమయంలో వీడియోలు వరుసగా లీక్ చేస్తూ చిత్ర యూనిట్ ను తెగ ఇబ్బంది పడుతున్నారు . ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించిన షూటింగ్ వీడియో లీక్ చేసి రచ్చ చేశారో అందరికీ తెలిసిందే .. రీసెంట్ గా కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగలించి హాట్ టాపిక్ గా మారారు .. అయితే ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్ సినిమా కూడా ఇలాంటి సమస్య వచ్చి పడింది .. ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ సీక్వెన్స్ కు సంబంధించిన వీడియోని లీక్ చేస్తామంటూ కొందరు ఆ చిత్ర యూనిట్ ను తెగ భయపడుతున్నారు .. ఇప్పటికే ఓ లీక్‌డు ఫోటోను కూడా సోషల్ మీడియాలో వదిలారు .. దాన్ని జాగ్రత్తగా గమనిస్తే దాని ఓ వీడియో నుంచి కట్ చేసినట్టు ఉంది అంటే ఆ వీడియో మొత్తం లీక్ చేసిన వ్యక్తి చేతిలో ఉన్నట్టు కనిపిస్తుంది .. ఇది కొంత సీరియస్ మేటర్ ..
ఇదిగో అదుగో అప్డేట్ అంటూ ఎప్పటికప్పుడు ఊరిస్తూనే వస్తున్నారు .. కానీ విషయం మాత్రం అసలు చెప్పటం లేదు .. ఈనెల మొదటి వారంలో టీజర్ అప్డేట్ ఉంటుందతింటు తాజాగా మరోసారి లీకులు వదులుతారు .. ఇలాంటి టైంలో నిజంగా లీకైన ఈ స్టీల్ యూనిట్ ను కొంత గందరగోళంలో పడేసింది .. ఇంకా ఆలస్యం చేస్తే మరింత కంటెంట్ లీక్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని విషయాన్ని ఈ చిన్న స్టిల్ చెప్పగానే చెప్పేస్తుంది .. ఇక మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా లెక్క ప్రకారం ఈపాటికి ప్రేక్షకులు ముందుకు రావాలి కానీ గ్రాఫిక్ వర్క్ లేట్ అవ్వడంతో వాయిదా పడుతూ వస్తుంది .. అయితే త్వరలోనే టీజర్ రిలీజ్ చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించే ఛాన్స్ ఉంది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు