సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో నిత్యామీనన్ ఒకటి. బెంగళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించిన నిత్యామీనన్.. `అలా మొదలైంది` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరపై అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులకు చేరువైంది. గ్లామర్ షో కన్నా కథ మరియు తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే నిత్యా మీనన్.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ స్టార్ హోదాను అందుకుంది. జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది.


ప్ర‌స్తుతం నిత్యా మీన‌న్ త‌మిళంలో విజ‌య్ సేతుప‌తితో `తలైవన్ తలైవి`, ధ‌నుష్ తో `ఇడ్లీ కడై` చిత్రాలు చేస్తోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధం అయ్యాయి. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం నిత్యా మీన‌న్ ఓ మూవీ ఈవెంట్ కు హాజ‌రైంది. అక్కడ ఓ వ్యక్తి షేక్‌హ్యాండ్ ఇవ్వబోగా.. అందుకు నిత్యామీనన్ నిరాకరించింది. తనకు జలుబు ఉందని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది. అయితే అదే ఈవెంట్ లో స్టేజ్‌ పై ఉన్న ఓ న‌టుడిని నిత్యా మీనన్ కౌగిలించుకొని మరీ మాట్లాడింది. దీంతో అప్పట్లో నిత్యా మీన‌న్‌పై నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు.


అయితే తాజాగా ఓ భేటీలో ఈ విషయంపై నిత్యామీనన్ ఘాటుగా స్పందించింది. నటీమణులను మగవారు సాధారణ మహిళల మాదిరిగా ఎందుకు చూడారంటూ నిత్యామీనన్ ప్రశ్నించింది. చాలా మంది నటీమణులు సులభంగా టచ్ చేయొచ్చు అని భావిస్తుంటారు. ఆ భావనతోనే ఏ ఈవెంట్ లో పాల్గొన్న, ఎక్కడికి వెళ్లినా కరచాలనం అంటూ తమను టచ్ చేయడానికి తెగ ఎగబడుతుంటారు. అలా ఈజీగా టచ్ చేయడానికి మేమేమ‌న్నా ఆట బొమ్మలమా.. త‌మ అనుమ‌తితో సంబంధం లేదా అంటూ నిత్యమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్ర‌స్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: