టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం క్రితం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. చిరంజీవి "విశ్వంబర" సినిమా పనులతో బిజీగా ఉన్న సమయం లోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని లాంచ్ చేశారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈ సినిమాలో నయనతార , చిరుకు జోడిగా కనిపించబోతుంది.

మూవీ కి బీమ్స్ సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ ని అనిల్ రావిపూడి పక్క మాస్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పెద్దగా సాంగ్స్ ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. కానీ చిరంజీవి , నయనతార మధ్య మాత్రం ఓ సాంగ్ ను అనిల్ రావిపూడి పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్లు , దానికి అద్భుతమైన ట్యూన్ ను ప్రస్తుతం సెట్ చేసే పనిలో అనిల్ ఉన్నట్లు , వీరిద్దరిపై ఒక మంచి సాంగ్ ను రూపొందించే విషయంలో అనిల్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ కావడం , అనిల్ రావిపూడి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ప్రస్తుతం మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: