మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ యాష్ హీరోగా ప్రశాంత నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 1 అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు ఈ మూవీ ద్వారా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కూడా సూపర్ సాలిడ్ విజయం సాధించడంతో ఈ బ్యూటీ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా మరింతగా పెరిగింది.

అలా కే జి ఎఫ్ సిరీస్ మూవీ లతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళ సినిమా అయినటువంటి కోబ్రా మూవీ లో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ తాజాగా నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు మరో రెండు , మూడు సినిమాల్లో అవకాశాలు దక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ బ్యూటీ కన్నడ , తమిళ్ , తెలుగు భాషల సినిమాల్లో నటించింది. ఈమెకు కన్నడ , తెలుగు సినిమాల ద్వారా మంచి విజయాలు వచ్చాయి. కానీ ఒక తమిళ్ సినిమా ద్వారా మాత్రమే ఈమెకు అపజయం దక్కింది. శ్రీనిధి శెట్టి "హిట్ ది థర్డ్ కేస్" మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: