పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొట్టమొదటి పీరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మొదట ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో  తియగా కొన్ని కారణాల చేత షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా నుంచి క్రీష్ తప్పుకున్నారు. ఆ తర్వాత ఏఎం జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం బాధ్యతలను తీసుకొని మరి సినిమాని పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర ఉన్నప్పటికీ ఎలాంటి హంగామా కనిపించడం లేదు.

హరిహర వీరమల్లు సినిమాలో బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా నటిస్తున్నారు. అలాంటి వారిలో నర్గీస్ ఫర్గీ కూడా ఒకరు. ఇందులో మొగల్ సామ్రాజ్యపు యువరాణిగా కనిపించబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు వీరమల్లు సినిమా నుంచి లీకైన కంటెంట్లో ఆమె ఎక్కడా కనిపించడం లేదట.దీంతో అసలు వీరమల్లు చిత్రంలో నర్గీస్ పక్రిప్ నటించిందా లేదా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. అయితే రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.


నర్గీస్ ఫర్గీ వీరమల్లు మొదటి భాగంలో కనిపించదని వెల్లడించారు. వీరమల్లు రెండో భాగంలో నర్గీస్ ఫర్గీ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోందని మొదటి భాగంలో ఆమె అసలు కనిపించదు అంటూ తెలియజేశారు. మరి ఇంకా ఎవరెవరు మొదటి భాగంలో కనిపించరో చూడాలి. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నారు. నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పటికీ ఈ సినిమా విడుదల కావాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈనెల ఎనిమిదవ తేదీన తిరుపతిలో చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: