తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించాడు. కానీ వాటి ద్వారా ఈయనకు పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈయన డీజే టిల్లు అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఈయనకు సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో సిద్దుకు తెలుగు సిద్దు కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. కొంత కాలం క్రితం సిద్దు "డీజే టిల్లు" మూవీ కి కొనసాగింపుగా రూపొందిన ట్టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా వరుసగా రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్న సిద్దు కొంత కాలం క్రితం జాక్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే సిద్దు ప్రస్తుతం తెలుసు కదా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రాసి కన్నా , శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సంవత్సరం అక్టోబర్ 17వ తేదీ న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఈ ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: