తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొట్ట మొదటి సారి తన కెరీర్లో హిందీలో వార్ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి యష్ రాజు ఫిలిం సంస్థ ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యొక్క టీజర్ను జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు వర్షన్ టీజర్ కు ప్రేక్షకుల నుండి పెద్ద స్థాయిలో రెస్పాన్స్ లభించలేదు. కానీ ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ టీజర్ కు మాత్రం సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం భారీ పోటీ నెలకొని ఉంది అని అనేక వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి సమయంలో యాష్ రాజ్ ఫిలిం సంస్థ వారు ఈ సినిమాను తెలుగులో సొంతగా విడుదల చేయాలి అనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన క్రేజ్ ఉండడంతో ఈ మూవీ ని యాష్ రాజ్ ఫిలిం సంస్థ వారు ఓన్ గా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: