ఏంటి ధనుష్ తో ఓ డైరెక్టర్ ప్రేమలో పడ్డారా.. ఇంతకీ ధనుష్ ప్రేమలో పడ్డ ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న ధనుష్ కేవలం కోలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ అభిమానులు ఉన్న హీరోలలో ఈయన కూడా ఒకరు.హీరో కటౌట్ లేకుండానే ఎన్నో సినిమాలతో మంచి మెసేజ్ లు ఇస్తూ తాజాగా కుబేర మూవీతో మన ముందుకు రాబోతున్నారు.జూన్ 20న విడుదలకు సిద్దంగా ఉన్న కుబేర మూవీకి సంబంధించి తాజాగా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్గా నిర్వహించారు.ఇక ఈవెంట్ కి సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు హాజరయ్యారు. నాగార్జున రష్మిక మందన్నా శేఖర్ కమ్ముల వంటి వాళ్ళు ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు.

 ఇందులో భాగంగా రష్మిక కుబేర ప్రపంచంలో నన్ను భాగం చేసినందుకు చాలా ధన్యవాదాలు.ఇలాంటి ఒక సినిమాలో ఇంతమంది గొప్ప వాళ్ళతో కలిసి నటించడం నా అదృష్టం.అలాగే ధనుష్ తో ఓ రొమాంటిక్ సినిమాలో కూడా నటించాలనుకుంటున్నాను అని తెలియజేసింది. ఇక శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ధనుష్ చాలా టాలెంటెడ్ నటుడు.ఆయనతో షూటింగ్ సెట్ లోనే నేను ప్రేమలో పడిపోయాను. కుబేర వంటి బ్రిలియంట్ సినిమా కోసం ఇందులో చేసిన ప్రతి ఒక్కరు చాలా కష్టపడి సినిమా చేశారు. ఈ సినిమాకి ధనుష్ కి మరోసారి జాతీయ అవార్డు వస్తుందని నా నమ్మకం అంటూ శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.

ఇక నాగార్జున కూడా ధనుష్, శేఖర్ కమ్ముల లాంటి టాలెంటెడ్ పర్సన్స్ తో వర్క్ చేయడం బాగుందని చెప్పాలి.అంతేకాకుండా తనతో సినిమా ఎప్పుడు చేస్తావని లైవ్ లోనే శేఖర్ కమ్ములను అడిగారు. ఇక ధనుష్ కూడా తన అభిమానులు ఎప్పుడు తనకు అండగా ఉంటారు. ఎవరు ఎన్ని నెగిటివ్ కుట్రలు చేసినా కూడా నా అభిమానులను దాటుకొని నా దగ్గరికి రాలేవు అని సినిమాని ఉద్దేశించి అభిమానులను ఉద్దేశించి గొప్పగా మాట్లాడారు. ధనుష్ అలా ఈ సినిమా షూటింగ్ సమయంలో ధనుష్ తో ప్రేమలో పడ్డాను అంటూ శేఖర్ కమ్ముల చెప్పిన మాటలు నెట్టింటి వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: