
వాస్తవానికి ఈ నెల 8వ తేదీన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఈవెంట్ లోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుందని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా గురించి మళ్లీ నెగిటివ్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిర్మాత నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది.
హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీనే విడుదల కావాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వాయిదా పడింది. మరోసారి వాయిదా పడితే ఈ సినిమా బిజినెస్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు వాయిదా పడితే ఈ సినిమాకు మరో మంచి డేట్ దొరకడం సులువైన విషయం కాదు.
హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు మొదలైందో కానీ ఈ సినిమాకు ఏ విషయం కూడా కలిసిరాలేదు. ఈ సినిమా నిర్మాతపై కూడా వడ్డీల భారం ఊహించని స్థాయిలో పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా 300 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరోవైపు హరిహర వీరమల్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం క్యాన్సిల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. హరిహర వీరమల్లు మూవీ మళ్లీ వాయిదా పడితే సినిమా రిజల్ట్ పై ఆ ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంది.