తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక ఈమేజ్ ను సొంతం చేసుకున్న వారిలో మంచు విష్ణు ఒకరు. ఈయన తాజాగా కన్నప్ప అనే సినిమాలో నటిస్తున్న విష యం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలి గిన నటులు అయినటువంటి ప్రభాస్ , అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు .ఇలా ఈ సినిమాలో అనే క మంది ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న నటీనటులు నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై మొదటి నుండి కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క ట్రైలర్ ఈవెంట్ ను ఒక పెద్ద ఇండోర్ స్టేడియంలో చేయాలి అని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్మీడియా మీట్ లో కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మోహన్ లాల్ కూడా కొచ్చిలో ఓ మీడియా మీటిలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ బృందం వారు అదిరిపోయే రేంజ్ లో ప్రమోషన్లను చేయడానికి ప్లాన్స్ వేస్తూ ఉండగా మంచు విష్ణు చాలా పెద్ద ప్లాన్ వేశాడు. తెలుగు సినీ పరిశ్రమలో రాజమౌళి , అనిల్ రావిపూడి అద్భుతమైన స్థాయిలో ప్రమోషాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక మంచు విష్ణు కూడా ఈ సినిమాతో వారి రూట్లోకి వచ్చేలా ఉన్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: