గత కొద్ది రోజుల నుంచి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా గురించి నిరంతరం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. సుమారుగా ఈ సినిమా మొదలుపెట్టి ఇప్పటికి ఐదేళ్లు కావస్తోంది.. ఇప్పటికీ ఈ సినిమా విడుదల విషయంలో వాయిదాలు పడుతూనే ఉన్నాయి. అనంతరం ఈనెల 12న ఈ సినిమా రిలీజ్ కాబోతోందని అయితే ఇంకా విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో మరొకసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా హరిహర వీరమల్లు సినిమాకి ఎందుకో నెగిటివిటీ చాలా ఎక్కువగా సృష్టిస్తున్నారు.


కొంతమంది హరిహర వీరమల్లు సినిమాకి అసలు బిజినెస్ జరగలేదని సినిమా కొనడానికి ఎవరు ముందుకు రావడంలేదని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమాకే ఇలా జరగడంతో అటు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం అటు అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న ఈ రూమర్స్ పైన చిత్ర బృందం ఫైర్ అయ్యింది. హరిహర వీరమల్లు సినిమా బిజినెస్ పై వస్తున్న ఈ వార్తలను ఖండించింది.


పవన్ కళ్యాణ్ సినిమాకి బయర్లు దొరకకపోవడమేంటి? ఈ విషయాన్ని కొంతమంది నమ్మడమేంటి? చాలా కామెడీగా ఉందంటూ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్ అని.. అలాంటి బ్రాండ్ కి బయ్యర్లు దొరకకపోవడమేంటి ఇది కావాలని స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారంటూ చిత్ర బృందం తెలియజేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వెనుక ఎవరికి ప్రయోజనం ఉందో ఆ భగవంతునికే తెలియాలి అంటూ తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి మొట్టమొదటి రాబోతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమాలో చారిత్రక యోధుడిగా నటించారు. భారీ బడ్జెట్ తో 2020లో మొదలుపెట్టిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. మరి రెండవ భాగం రిలీజ్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: