ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా రీ రిలీజ్ అవుతున్న సినిమాలలో కొన్ని సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. దానితో రీ రిలీజ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మరో సినిమా రీ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. కొన్ని సంవత్సరాల క్రితం రాహుల్ రవీంద్రన్ , నవీన్ చంద్ర హీరోలుగా లావణ్య త్రిపాఠి హీరోయిన్గా హను రాఘవపూడి దర్శకత్వంలో అందాల రాక్షసి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ఆ సమయంలో పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీ ని జూన్ 13 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన సినిమాలలో స్టార్ హీరోలు నటించిన సినిమాలకు రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి.

ఆ తర్వాత ప్రేమ కథ చిత్రాలకు రీ రిలీజ్ లో బాగంగా ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ఇక అందాల రాక్షసి సినిమా ప్రేమ కథాంశంతో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లు దక్కుతాయి అని చాలా మంది భావిస్తున్నారు. మరి అందాల రాక్షసి మూవీ కి రీ రిలీజ్లో భాగంగా ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో , ఈ మూవీ ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: