మోహన్ బాబు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు  సరైన హిట్ కోసం  చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు.. తాజాగా ఆయన కన్నప్ప సినిమాలో నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. జూన్ 27వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా  విడుదలకు సిద్ధమైంది. ఇదే తరుణంలో మంచు విష్ణు ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై ప్రజల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ  తనకు సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలను కూడా బయట పెట్టాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు తనకు ఒక సెటప్ ఉందని ఆ సెటప్ తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందని తెలియజేశాడు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప మూవీ అనేది నా యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్.. 

దీనికోసం దాదాపు పది సంవత్సరాల నుండి కష్టపడుతూ వస్తున్నాను.. ప్రస్తుతం సినిమా సక్సెస్ఫుల్గా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైందని తెలియజేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ కూడా నటించారని ఆయనతో నటించడం నాకు ఒక గొప్ప అనుభూతి అని తెలియజేశారు. ఇక ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్లోకి వచ్చారు అంటే తప్పకుండా  అందరికీ అద్భుతమైన భోజనాన్ని అందిస్తూ ఉంటారు. అలాంటి ప్రభాస్ కు షూటింగ్ సమయంలో మీరు ఎలాంటి ఫుడ్ పెట్టించారని ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించింది. దీనిపై మంచు విష్ణు మాట్లాడుతూ..  షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రభాస్ కి ఏది కావాలంటే అది ఫ్రెష్ గా తయారుచేసి ఇచ్చే వాళ్ళమని అన్నారు. అది కూడా ఎక్కడో బయట తేకుండా తాను ఎక్కడ ఉంటే అక్కడే వండి తనకు పెట్టే వాళ్ళమని తెలియజేశాడు.

అయితే నేను గత ఐదు సంవత్సరాల నుంచి కొంతమంది వంట వాళ్ళని సెటప్ చేసుకున్నానని, వాళ్లు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి వండి పెడతారని తెలియజేశాడు. అయితే ప్రభాస్ కి కూడా వాళ్లే ఫ్రెష్ గా వండి అందించాలని  అన్నారు. నాకు చెడు అలవాట్లు ఏమీ లేవు కానీ ఫుడ్ ను చాలా ఇష్టంగా తింటానని అందుకే ఈ ఏర్పాట్లు చేసుకున్నానని తెలియజేశారు.. ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న ప్రభాస్ తో నేను నటించడం ఒక మంచి పరిణామం అని  తెలియజేశారు. ప్రభాస్ డాడీ ని బావ బావ అంటూ పిలుస్తారని, వీరిద్దరూ కలిసి బుజ్జిగాడు సినిమాలో నటించారని, దీంట్లో త్రిష కు అన్నయ్యగా డాడీ నటించారని ఆ సినిమాలో ప్రభాస్ ఆయన్ని బావ అని  పిలిచారని అప్పటినుంచి బయట కూడా బావ బావ అంటూ పిలుస్తారని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: