
పెళ్లికి అఖిల్ చాలా సింపుల్ గా ఉండే ట్రెడిషనల్ పంచెను ఎంచుకోగా.. జైనబ్ డైమండ్ జ్యువెలరీతో కూడిన చీరను ధరించి అందరిని ఆకట్టుకుంది . కాగా అఖిల్ - జైనబ్ ల పెళ్లి లో అక్కినేని ఫ్యామిలీ ఆనందంగా స్టెప్పులు వేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి . అఖిల్ తన తండ్రి నాగార్జున టొ అన్నయ్య నాగచైతన్య తో సంతోషంతో ఊగిపోతూ డాన్స్ చేశారు. ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు . హీరో సుశాంత్ కూడా డ్యాన్స్ అదరగొట్టేసాడు. సుమంత్ - సుశాంత్ - నాగచైతన్య- అక్కినేని కోడలు పిల్ల శోభిత ధూళిపాళ్ళ ఈ వివాహానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు .
ఓ వీడియోలో సుశాంత్ ధూమ్ ధామ్ అంటూ డ్యాన్స్ చేస్తూ కనిపించారు . అంతేకాదు అఖిల్ తన తండ్రి నాగార్జునతో అన్న నాగచైతన్యలతో ఫుల్ హ్యాపీగా చిందులు వేశారు . ఆ ఆనందం వీళ్ళ డాన్స్ లో బాగా కనిపించింది . ఓ వీడియోలో అఖిల్-నాగార్జున - నాగ చైతన్య డాన్స్ చేస్తూ కనిపించారు . ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతుంది. చాలాకాలం తర్వాత అక్కినేని ఫ్యామిలీని ఇంత హ్యాపీగా చూసాం అంటున్నారు అభిమానులు. అక్కినేని అఖిల్ - జైనన్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అంటూ బ్లెస్ చేస్తున్నారు..!