కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ శాతం ఏ భాష సినిమాలు ఆ భాషలో విడుదల అయ్యేవి. కొన్ని కొన్ని సినిమాలు మాత్రమే ఎక్కువ భాషల్లో విడుదల అయ్యేవి. ఇక బాహుబలి సినిమా ఎప్పుడైతే ఐదు భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుందో అప్పటి నుండి ఇండియా వ్యాప్తంగా అనేక మంది తమ సినిమాలను అనేక భాషల్లో విడుదల చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఒక సినిమాను తమ సొంత భాషలో కాకుండా ఇతర భాషల్లో విడుదల చేసే సందర్భంలో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా ఒక క్రేజీ హీరోమూవీ లో కనుక ఉన్నట్లయితే దానిపై ఆ రాష్ట్రంలో కూడా మంచి అంచనాలు నెలకొనే అవకాశం ఉంటుంది.

దానితో అనేక మంది సినిమాలు రూపొందించిన సమయంలో అనేక మంది క్రేజ్ ఉన్న నటీనటులను సినిమాల్లోకి తీసుకుంటున్నారు. ఉదాహరణకు రజనీకాంత్ హీరోగా రూపొందిన జైలర్ మూవీ లో కన్నడ సినీ పరిశ్రమకు సంబంధించిన శివరాజ్ కుమార్ , మలయాళ సినీ పరిశ్రమకు సంబంధించిన మోహన్ లాల్ , హిందీ సినీ పరిశ్రమకు సంబంధించిన జాకీ షర్ఫ్ నటించారు. వీరి ద్వారా ఈ మూవీ కి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ మూవీ లో సూర్య చిన్న క్యమియో పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని సూర్య పాత్రకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

ఇక ప్రస్తుతం రజనీ కాంత్ హీరోగా జైలర్ 2 అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ ఓ చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ ఈ సినిమాలో చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్తలు బయటకు రావడంతో ఈ మూవీ పై అప్పుడే తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: