టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది యువ నటీమణులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది కి మాత్రమే అద్భుతమైన విజయాలు దక్కుతున్నాయి. వారు మాత్రమే అద్భుతమైన స్థాయికి చేరుకుంటున్నారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సూపర్ సాలిడ్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న నటీమణులలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ బ్యూటీ సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈమె రవితేజ హీరోగా రూపొందిన కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ కూడా ఈమెకు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. ఇలా వరుసగా ఈమె నటించిన రెండు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈమె కెరియర్ పని అయిపోయింది అని చాలా మంది భావించారు. అలాంటి సమయం లోనే ఈమె అదిరిపోయే రేంజ్ లో బౌన్స్ బ్యాక్ ఇచ్చింది. మొదటగా మీనాక్షి కి హిట్ ది సెకండ్ కేస్ మూవీ తో విజయం తెలుగు బాక్సా ఫీస్ దగ్గర దక్కింది. ఆ తర్వాత నుండి ఈమెకు తెలుగులో అవకాశాలు భారీగా పెరిగాయి. అలాగే ఈమె నటించిన సినిమాల్లో విజయాలు అందుకున్న సినిమాల సంఖ్య కూడా చాలానే ఉంది. ఆఖరుగా ఈమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయన్ని అందుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం మీనాక్షి స్పీడ్ చూసి స్టార్ హీరోయిన్లు కూడా కుళ్లుకుంటున్నట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా ఈమె ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోవడం ఖాయం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc