మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన కన్నప్ప సినిమా ఈనెల 27వ  తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ బాబు సైతం నటిస్తున్న కన్నప్ప సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విష్ణు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
 
గత నెలలో విడుదలై హిట్టైన సింగిల్ సినిమా ట్రైలర్లో శివయ్యా అనే డైలాగ్ ఉండగా తర్వాత రోజుల్లో ఆ డైలాగ్ ను తొలగించారు. ఈ వివాదం గురించి తాజాగా మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. తాను ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఒక లేఖ రాశానని బయట వాళ్లందరూ మనల్ని విమర్శించే సమయంలో లేదా ఎగతాళి చేసే సమయంలో మనమందరం ఒకటి అవ్వాలని మనమందరం ఒకటిగా ఉండాలని విష్ణు తెలిపారు. ఆ సినిమాలో బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారని విష్ణు పేర్కొన్నారు. అదే సమయంలో బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వచ్చిందని విష్ణు చెప్పుకొచ్చారు. ఒకరు కూడా బాలయ్యకు కంగ్రాట్స్ మెసేజ్ పెట్టలేదు కానీ ఆయన కామెడీ అయితే చేశారని విష్ణు అన్నారు.
 
ఆ సినిమాలో కన్నప్ప సినిమా కూడా కామెడీ చేశారని ఇండస్ట్రీలో ఇది కొత్త ట్రెండా? మీరు అడ్రెస్స్ చేస్తారా? రేపు నా సినిమాలో పెట్టినప్పుడు ఎవరైనా అడిగితే మాత్రం బాగుండదు. ఇది ఇప్పుడు నార్మల్ గా ఉందా? అలా అయితే నేను కూడా అంగీకరిస్తానని ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందని చెప్తే నేను కూడా నేర్చుకుంటానని లేఖలో చెప్పానని విష్ణు వెల్లడించారు.
 
ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్లు నిర్మాత అల్లు అరవింద్ తో మాట్లాడారని ఆ సినిమాలో శివయ్య డైలాగ్ ఎందుకు పెట్టారు ఎందుకు తీసేసారు అని అల్లు అరవింద్ గారిని అడగాలని విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు కన్నప్ప సినిమా పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తుండగా సినిమా విడుదల సమయానికి వివాదాలు సర్దుమనగాలని అభిమానులు కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: