
అయితే మీరందరి ఆశలపైన నీళ్లు జల్లుతూ చిత్ర బృందం అనంతపని చేసినట్లు తెలుస్తోంది. అదే రిలీజ్ డేట్ వాయిదా వేయడం.. దీంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు సినీ రంగానికి చెందిన వారందరూ కూడా చేస్తున్నారు.. తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ సెకరెటరీ శ్రీధర్ మాట్లాడుతూ ఈ చిత్రం పైన వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు.. వాయిదా అనే ఇష్యూ క్రియేట్ చేసింది కేవలం ఇద్దరు ప్రొడ్యూసర్స్, ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే అంటూ తెలియజేశారు.
హరిహర వీరమల్లు సినిమా ఉందని ప్రతి థియేటర్ కూడా ఖాళీగానే పెట్టుకున్నాము కానీ ఇప్పుడు ఈ నెల అంతా ఖాళీగానే.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం, కోర్టు, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. హీరోలకు స్టార్ డం వచ్చింది కేవలం ఈ సింగల్ స్క్రీన్స్ వల్లే కానీ ఈ సింగల్ స్క్రీన్స్ ని వారు అసలు పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు శ్రీధర్ ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయం పైన అటు చిత్ర బృందంతోపాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇప్పటికే వాయిదాల అనంతరం ఈ సినిమా కొన్ని కోట్ల రూపాయలు నష్టాన్ని చవిచూస్తున్నట్లు తెలుస్తోంది.