నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే బాలయ్య ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా డాకు మహారాజు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఆఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఇప్పటికే అఖండ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో అఖండ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం హనీఫ్ ఆదేని దర్శకత్వంలో మార్కో అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ దర్శకుడు ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు , అందులో భాగంగా తాజాగా ఈ దర్శకుడు బాలయ్యకు ఓ కథను కూడా వినిపించినట్లు , ఆ కథ బాగా నచ్చడంతో ఈ దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

బాలయ్య మాస్ , యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. మార్కో మూవీని హనీఫ్ అదేని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించి సక్సెస్ అయ్యాడు. అలాంటి వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రూపొందుతుంది అంటే దానిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడం ఖాయం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: