యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో హిందీలో వార్ 2 అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. కొంత కాలం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం వార్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో , ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడింది అని , దాని కోసం ఎంతో మంది పోటీపడుతున్నారు అని వార్తలు బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వారు జూనియర్ ఎన్టీఆర్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ దృశ్య ఈ మూవీ యొక్క తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఎవరికి అమ్మకూడదు అని తామే సంతగా విడుదల చేయాలి అని ఆలోచనకు వచ్చినట్లు ఓ వార్త వైరల్ అయింది.

ఇకపోతే ప్రస్తుతం యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వారు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను మాత్రమే కాకుండా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఓన్ గా విడుదల చేయాలి అనే ఆలోచనకు వచ్చినట్లు , అందులో భాగంగా ప్రస్తుతం ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వార్ 2 కోసం యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వారు భారీ రిస్క్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: