టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరస పేట్టి అద్భుతమైన విజయాలను అందుకుంటు ఫుల్ జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం అఖండ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ఆ తర్వాత వరుస పెట్టి వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి తాజాగా డాకు మహారాజు సినిమాలతో విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ "ఆఖండ 2" మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే అఖండ 2 మూవీ తర్వాత బాలకృష్ణ ఏ దర్శకుడి సినిమాలో నటిస్తాడు అనే దానిపై ప్రేక్షకుల్లో చాలా కాలంగా ఉత్కంఠ నెలకొని ఉంది. అందుకు ప్రధాన కారణం ... బాలకృష్ణ "అఖండ 2" మూవీ తర్వాత ఆ దర్శకుడితో సినిమా చేయనున్నాడు. ఈ దర్శకుడితో సినిమా చేయనున్నాడు అని అనేక వార్తలు వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా బాలకృష్ణ "అఖండ 2" మూవీ తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు , ఏ బ్యానర్లో సినిమా చేయనున్నాడు అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడింది. 

బాలకృష్ణ తన తదుపరి మూవీ ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ ని వెంకట సతీష్ కిలారు నిర్మించబోతున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఎన్బికె 111 అనే వర్కింగ్ టైటిల్ తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వెంకట సతీష్ కిలేరు నిర్మాణంలో ఓ మూవీ రూపొందునున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nbk