ఏంటి ఆ హీరోయిన్ ని చిరంజీవి ఎత్తుకొని పెంచారా..కట్ చేస్తే ఆమెతోనే రొమాన్స్ చేశారా..ఇంతకీ చిన్నప్పుడు చిరంజీవి ఎత్తుకొని పెద్దయ్యా అదే హీరోయిన్ తో రొమాన్స్ చేశారు అంటూ వార్తల్లో ఉన్న ఆ హీరోయిన్ ఎవరు? ఇంతకీ ఇది నిజమేనా.. అనేది ఇప్పుడే చూద్దాం. హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ అనేది అస్సలు చూసుకోరు. తాత వయసున్న హీరోలతో కూడా మనవరాలు వయసున్న హీరోయిన్లు  రొమాంటిక్ సీన్స్ చేస్తారు. ఒక సినిమాలో ఏ హీరోకి చెల్లెలుగా.. కూతురుగా.. మనవరాలిగా..చేస్తారో మళ్ళీ ఆ తర్వాత వేరే సినిమాలో అదే హీరోకి ఆ హీరోయిన్ భార్యగా..లవర్ గా..నటించడం మనం ఎన్నో సినిమాల్లో చూసాం.అలా ఎన్టీఆర్ శ్రీదేవి విషయంలో మనం చూసాం.

ఇక వీళ్లిద్దరే కాకుండా ఎంతో మంది హీరో హీరోయిన్లు ఇలా సినిమా డిమాండ్ చేస్తే వైవిధ్యమైన పాత్రలు పోషించిన వారు ఉన్నారు.ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా ఓ షోలో చిరంజీవితో నటించిన ఓ హీరోయిన్ చిన్నప్పుడు నన్ను ఆయన ఎత్తుకున్నారు.. అలాంటిది ఆయన సినిమాలోనే నేను హీరోయిన్ గా చేశాను అని చెప్పుకొచ్చింది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పటి సీనియర్ నటి రంభ.. చిరంజీవి రంభ కాంబినేషన్లో అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా, హిట్లర్ వంటి సినిమాలు వచ్చాయి.

అయితే చిరంజీవితో ఈ సినిమాల అనుభవం గురించి రంభ ఓ షోలో మాట్లాడుతూ.. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులతో కలిసి చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు మూవీ షూటింగ్ కి వెళ్లాను. ఆ టైంలో ఆయన నన్ను ఎత్తుకున్నారు కూడా.. అయితే నేను నిద్రపోవడం వల్ల ఆ ఫోటోలో సరిగ్గా కనిపించను.కానీ కట్ చేస్తే పెద్దయ్యాక అదే చిరంజీవి సరసన నేను హీరోయిన్ గా నటించాను.నన్ను ఎత్తుకున్న ఆ హీరోతో సినిమాలో చేయడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది అంటూ రంభ చెప్పుకొచ్చింది. అంతేకాదు తన ఫేవరెట్  హీరోలలో చిరంజీవి కూడా ఒకరు అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: